గురువు గారు మీకు మరీ చాదస్తమ్ ఎక్కువయిందండి
ఏర మల్లిగా నీ గోలేందిరా బాబు
మీరు ఒక రాయి పట్టుకుని మీ చెంప మీరె వాయించుకుంటున్నారంట
అది రాయి కాదురా బడుద్దాయ్ వజ్రమ్
వజ్రమయితె మటుకు పల్లు రాలగొట్టుకుంటారటండి?
అది వజ్రమ్ కూడ కాదురా ప్లాటినమ్
ఏదోఒకటి లెండి గురువు గారు పల్లు రాలగొట్టుకోడానికి ఏ రాయి అయితే ఏంటి లెండి
వట్టి శుంఠవి నీకేమి తెలుస్తాది లేర వజ్రాలు కన్న విలువయిన ప్లాటినమ్ గురుంచి
నాకయితే మన కొండ మీద కుప్పలు కుప్పలు ఉండే రంగు రాయి లానె ఉంది...
నీ కళ్ల టో కాదుర నా కళ్లతో చూడు
ఏ కళ్లతో చూసిన అది ఎంత అరుదయిన లోహమయిన మీ లెంప మీరె వాయగొట్టుకోవడమ్
అది లెంప వాయగొట్టుకోవడమ్ కాదుర ... ప్రేమ..... అయిన పోకిరోడివి నీకేమి తెలుస్తుందిరా ప్రేమ
అయ్యబాబోయ్ అది ప్రేమ అండి నన్ను క్షమించండి గురూ గారు మిమ్మల్ని ఆ దేవుడు కూడ ఆపలేడు మీరు ఇంక కానీయండి
పిచ్చివాని చేతిలో రాయి ఉంటె వాడు ఎవడమీదకయిన ఇసురుతాడు.....
ప్రేమలో దెబ్బ తిన్నవాడి చేతిలో రాయి ఉంటే దానితో వాడి తల వాడె పగలగొట్టుకుంటాడు
ఇప్పుడు గురువు గారు రాయిని దూరమ్గా విసిరేయచ్చు , కాని విసరరు
తన చేతిలోనె ఉంచుకుంటారు...లెంప పగుల్తూనె వుంటాది... రాయి చేతిలోనె ఉంటాది......
పైగా అదె బాబు ప్రేమంటె అయినా బండోడివి నీకేమి అర్థమవుతాదిలే...అని అంటారు
ప్రేమలో విఫలమయిన వాడికి ఆ గుర్తులు ఆ మెమరీసె ఓ పెద్ద బండ దానితో తన తల తానె బదుకుంటూ ఓ వైపు ఏడుస్తుంటాడు అల అని ఎందుకురా బాబు వదిలేయచ్చు కద అంటె లేదు బ్రదర్ ఇలానె సమ్మగా ఉంది..
నువ్వు కాదు నేను కాదు ఎంతమంది సలహాలు ఇచ్చిన ఈ తతంగమ్ నడుస్తూనె ఉంటాది ...
ఎప్పుడో ఒకప్పుడు ఆగచ్చు కాని అది ఎప్పుడు అన్నది ఎవరికి తెలీదు...ఆఖిరికి వానికి కూడ
మరపు రాని బాధ కన్న మదురమే లేదోయ్ అని ఊరికి పాడలేదు ఘంటసాల గారు...
ప్రపంచంలో ఏ వైద్యుడు ఆఖిరికి దేవుడు కూడ కుదర్చలేని పిచ్చి ప్రేమ...
తప్పక చూడండి,
Amores perros
No comments:
Post a Comment